క్రికెట్ దిగ్గజం, జింబాబ్వే మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోయాడన్న వార్తలు నిజం కావని తేలింది. హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడని అతని స్నేహితుడు హెన్రీ ఊలంగా ధృవీకరించాడు. అయితే హీత్ స్ట్రీక్ చనిపోయాడని హెన్రీ ఊలంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ ..ఆ తర్వాత హీత్ స్ట్రీక్ తో మాట్లాడాడు. అనంతరం హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడని మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
నేను బతికే ఉన్నా..
హెన్రీ ఊలంగా హీత్ స్ట్రీక్ తో మాట్లాడిన చాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ చాట్ లో తన మరణ వార్తపై హీత్ స్ట్రీక్ స్పందించాడు. తాను బతికే ఉన్నా. ఈ రనౌట్ను వెంటనే వెనక్కు తీసుకో బడ్డీ..అని హెన్రీ ఊలంగాకు రిప్లై ఇచ్చాడు. తాను చనిపోయానన్న వార్త వేగంగా ప్రంపంచానికి చేరువైందన్నాడు. అయితే దీనికి సమాధానంగా నువ్ ఓవర్ నైట్ లో చచ్చిపోయావ్ బ్రదర్..అంటూ ఊలంగా జోక్ చఏశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.