ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. సిడ్నీ వేదికగా జరిగిన మొదటి టీ20లో ఆతిథ్య ఆసీస్ ఘన విజయం సాధించింది. 57 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళలు 198 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ఇంగ్లీష్ మహిళలు 140 పరుగులకే చాప చుట్టేశారు.
ఇదిలావుంటే, ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ మహిళా జట్టు కెప్టెన్ హీథర్ నైట్ అరుదైన ఘనత సాధించింది. క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టుకు అత్యధిక మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ పురుషుల జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్, పాల్ కాలింగ్‌వుడ్ వంటి వారు వెనుక బడిపోయారు.
ALSO READ | WI vs BAN: సెంచరీతో విధ్వంసం.. మిథాలీ రాజ్ రికార్డ్ బ్రేక్ చేసిన మాథ్యూస్
మహిళలు టెస్ట్ క్రికెట్ ఆడటం చాలా తక్కువ. ఎంతసేపు టీ20లు, వన్డేలే. అందువల్లే హీథర్ నైట్ ఈ జాబితాలో దూసుకుపోతోంది.
ఇంగ్లండ్ పురుషుల, మహిళల జట్లకు కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు
- 1. హీథర్ నైట్: 94 మ్యాచ్‌లు (71 విజయాలు)
- 2. షార్లెట్ ఎడ్వర్డ్స్: 93 మ్యాచ్‌లు
- 3. ఇయాన్ మోర్గాన్: 72 మ్యాచ్‌లు (42 విజయాలు)
- 4. జోస్ బట్లర్ : 46 మ్యాచ్‌లు
- 5. పాల్ కాలింగ్‌వుడ్: 30 మ్యాచ్‌లు
ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. అత్యధిక టీ20ల్లో ఆడిన ఆసీస్ మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ ముందు వరకు ఈ రికార్డు ఆసీస్ ఓపెనర్ అలిస్సా హీలీ పేరిట ఉండేది. గాయం కారణంగా ఆమె తప్పుకోవడంతో ఆ రికార్డును పెర్రీ తన ఖాతాలో వేసుకుంది.
అత్యధిక టీ20లు ఆడిన మహిళా క్రికెటర్లు
- 1. హర్మన్‌ప్రీత్ కౌర్: 178 మ్యాచ్‌లు
- 2. సుజీ బేట్స్: 171 మ్యాచ్‌లు
- 3. డాని వ్యాట్-హాడ్జ్: 168 మ్యాచ్‌లు
- 4. ఎల్లీస్ పెర్రీ: 163 మ్యాచ్‌లు
- 5. అలిస్సా హీలీ: 162 మ్యాచ్‌లు
- 6. నిదా దార్: 160 మ్యాచ్‌లు