వరంగల్‌లో మిర్చి రికార్డు ధర

మిర్చి @ రూ.24,500
ఏనుమాములలో రికార్డు ధర 

కాశిబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో సింగిల్ పట్టి రకం మిర్చి క్వింటాల్​కు రూ.24,500 ధర పలకింది. సోమవారం మార్కెట్ యార్డుకు 60వేల నుంచి 80వేల వరకు మిర్చి బస్తాలు వచ్చాయి. క్వింటాల్ సింగిల్​పట్టి రకానికి  గరిష్టంగా రూ.24,500, కనిష్టంగా రూ.21,500 ధర వచ్చింది. ఇక దేశీ రకానికి రూ.20,500, రూ.18,500, తేజ రకానికి రూ.13,800, రూ.11 వేలు, వండర్​హాట్ కు రూ.15 వేలు, రూ.12 వేలు, యూఎస్​341కు రూ.15,500, రూ.12,500, దీపిక రకానికి రూ.13,300, రూ.11,500 గరిష్ట, కనిష్ట ధరలు పలికాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 3లక్షల 41వేల 280 బస్తాలు మార్కెట్ వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.