పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 7,142 దరఖాస్తులు అందాయి. వాటిలో అధిక శాతం 4,860 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం రాగా, రేషన్ కార్డుల కోసం 1,861 వచ్చాయి. పంచాయతీ రాజ్ గ్రామీణా అభివృద్ధికి 175, విద్యుత్ శాఖకు135, రెవెన్యూ పరమైన సమస్యలపై 46, ప్రవాసీ ప్రజావాణికి 01, ఇతర శాఖలకు 64 దరఖాస్తులు వచ్చినట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి తెలిపారు.