
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 401 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 116, విద్యుత్‌శాఖ, సింగరేణికి చెందినవి 51, ఎస్సీ సంక్షేమం 46, పంచాయితీ రాజ్గ్రామీణాభివృద్ధికి చెందినవి 45, హోంశాఖకు సంబంధించి 28, ఇతర శాఖలకు చెందినవి 115 ఉన్నాయి. ప్రణాళికా సంఘం వైస్చైర్మన్చిన్నారెడ్డి పర్యవేక్షణలో నోడల్అధికారి దివ్య దేవరాజన్దరఖాస్తులు స్వీకరించారు. కాగా, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు ప్రజాభవన్‌లో కనీసం తాగునీరు అందించలేదు. దాహం వేస్తే తాగడానికి నీళ్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.