వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత

ఖిలా వరంగల్, వెలుగు: వరంగల్ ఎంపీ ఎలక్షన్ లో భాగంగా శుక్రవారం సిటీలోని అండర్ బ్రిడ్జి, శివనగర్ ఏరియాలో వాహనాల తనిఖీలో భారీగా నగదు పట్టుకున్నట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఆధారాలు లేని రూ.7లక్షల 72వేలు స్వాధీనం  చేసుకుని, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంకి అప్పగించినట్లు చెప్పారు. తనిఖీల్లో సీఐలు గోపి, మల్లయ్య, ఎస్​ఐలు విట్టల్, వెంకన్న, షరీఫ్, మునీరుల్లా, గోవర్ధన్ పాల్గొన్నారు.