కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్
యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది; ఖాళీలు: 339; పోస్టుల వివరాలు: ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్–100, ఇండియన్ నేవల్ అకాడమీ–22, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ–169, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్–32, ఎస్ఎస్సీ విమెన్–16; అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, పైలట్ లైసెన్స్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు; సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్; దరఖాస్తులు: ఆన్‌లైన్; చివరితేది: 24 ఆగస్టు; ఎగ్జామ్ 14 నవంబర్; వెబ్‌సైట్: www.upsc.gov.in
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో..
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్స్, ప్రాజెక్ట్ ఇంజినీర్స్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది; ఖాళీలు: 511; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: బీటెక్‌లో మెరిట్, పని అనుభవం; దరఖాస్తులు: ఆన్‌లైన్; చివరితేది: 15 ఆగస్టు; వెబ్‌సైట్: www.bel-india.in
ఎయిర్ ఇండియాలో
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది; ఖాళీలు: 18; పోస్టులు: అకౌంట్స్ ఆఫీసర్స్–6, అకౌంట్స్ అసిస్టెంట్స్–12; సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్; దరఖాస్తులు: ఆఫ్‌లైన్; చివరితేది: 23 ఆగస్టు; వెబ్‌సైట్: www.airindia.in
నార్త్ సెంట్రల్ రైల్వేలో..
ప్రయాగ్‌రాజ్‌లోని నార్త్ సెంట్రల్ రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది; ఖాళీలు:1664; ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మెన్, ప్లంబర్; అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ; వయసు:15 నుంచి 24 ఏండ్లు; సెలెక్షన్ ప్రాసెస్: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక; దరఖాస్తులు: ఆన్‌లైన్; చివరి తేదీ: 1 సెప్టెంబర్; వెబ్‌సైట్: www.rrcpryj.org