కాశ్మీర్​లో తీవ్రమైన చలిగాలులు

కాశ్మీర్​లో తీవ్రమైన చలిగాలులు
  • గుల్ మార్గ్ @ మైనస్ 9 డిగ్రీలు


శ్రీనగర్: కాశ్మీర్​లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఆదివారం గుల్ మార్గ్​లో మంచు కురిసింది. దీంతో ఈ ప్రాంతంలో అతి తక్కువగా మైనస్ 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అమర్‌‌నాథ్ యాత్రకు బేస్ క్యాంప్‌‌గా ఉన్న పహల్గామ్‌‌లో మైనస్ 6.8 డిగ్రీలు, శ్రీనగర్ సిటీలో మైనస్ 3.3 డిగ్రీలు, కాశ్మీర్‌‌కు గేట్‌‌వేగా ఉన్న ఖాజీగుండ్‌‌లో మైనస్ 5.2 డిగ్రీల సెల్సియస్‌‌ ఉష్ణోగ్రత రికార్డయింది. 

ఉత్తర కాశ్మీర్‌‌లోని కుప్వారా, దక్షిణ కాశ్మీర్‌‌లోని కోకెర్‌‌నాగ్‌‌ లో మైనస్ 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాశ్మీర్‌‌లో రాబోయే10 రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ కార్యాలయం అంచనా వేసింది. లోయలోని ఎత్తైన ప్రాంతాలలో డిసెంబర్ 12న తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.