మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఫలితంపై ఉత్కంఠ.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ క్యాండిడేట్ల మధ్య టఫ్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఫలితంపై ఉత్కంఠ.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ క్యాండిడేట్ల మధ్య టఫ్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌
  • సొంత జిల్లాలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • మొదటి నుంచీ పోటాపోటీగా కార్యక్రమాల నిర్వహణ, ప్రచారం
  • ఈ నియోజకవర్గంలో ఇప్పటికి 10 సార్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, మూడు సార్లు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ విజయం

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆదివారం వెల్లడైన పాలమూరు లోకల్‌‌‌‌‌‌‌‌ బాడీస్‌‌‌‌‌‌‌‌ బైపోల్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా వచ్చింది. దీంతో మంగళవారం రానున్న మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఫలితం ఎలా ఉండబోతోందని నాయకులతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ క్యాండిడేట్లు చల్లా వంశీచంద్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీకే అరుణ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సొంత జిల్లా కావడం, ఇక్కడ వంశీ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రిజల్ట్‌‌‌‌‌‌‌‌పై జోరుగా చర్చ సాగుతోంది.

విస్తృతంగా పర్యటించిన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌

తన సొంత జిల్లా కావడంతో మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ స్థానంపై సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మొదటి నుంచీ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. ఇందులో భాగంగా పదేండ్లు పక్కకు పెట్టిన ‘కొడంగల్‌‌‌‌‌‌‌‌ -మక్తల్‌‌‌‌‌‌‌‌ -నారాయణపేట’ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల ముందే శంకుస్థాపన చేశారు. జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్లు సైతం మంజూరు చేయించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ వంశీచంద్‌‌‌‌‌‌‌‌ రెడ్డి నామినేషన్‌‌‌‌‌‌‌‌కు హాజరైన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 21న, మార్చి 6, 13, 28న మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, కోస్గి, కొడంగల్‌‌‌‌‌‌‌‌లో, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 8న నారాయణపేటలో, 19న పాలమూరు, 23న మద్దూరులో జరిగిన సభలు, నియోజకవర్గ స్థాయి కార్యకర్తల మీటింగ్‌‌‌‌‌‌‌‌లతో పాటు మక్తల్‌‌‌‌‌‌‌‌, కొత్తకోట, షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రోడ్‌‌‌‌‌‌‌‌షోలు, కార్నర్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరయ్యారు. 

వంశీచంద్‌‌‌‌‌‌‌‌రెడ్డిని లక్ష మెజార్టీతో 

గెలిపించాలని ప్రతీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ వంశీచంద్‌‌‌‌‌‌‌‌రెడ్డి గెలుపు కోసం రేవంత్‌‌‌‌‌‌‌‌తో పాటు మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, జి.మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌‌‌‌‌‌‌‌ సైతం విస్తృతంగా పర్యటించారు. మంగళవారం ఓట్లు లెక్కింపు జరగనుండడంతో రిజల్ట్ ఎలా ఉండబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొదటి నుంచీ పోటాపోటీయే..

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ స్థానంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ చల్లా వంశీచంద్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీజేపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ డీకే అరుణ మధ్య మొదటి నుంచీ టగ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌ నడిచింది. ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ రీలీజ్‌‌‌‌‌‌‌‌కు రెండు నెలల ముందు నుంచే రెండు పార్టీల క్యాండిడేట్లు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టారు. పాదయాత్రలు, బస్సు యాత్రలతో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఎమ్మెల్యేలు, లీడర్లను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని సైతం నువ్వా నేనా అన్నట్లుగా నిర్వహించారు. గడప గడపకూ తిరిగి తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 

ఇదే సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో పాటు, సవాళ్లు, ప్రతి సవాళ్లు సైతం చేసుకున్నారు. సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ర్డెడి ఆలస్యంగా రంగంలోకి దిగడం, ఎన్నికల ప్రచారానికి కేవలం నెల రోజులే ఉండడంతో అన్ని ప్రాంతాలను కవర్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయారు. అత్యధిక శాతం మంది ఓటర్లు కూడా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ వైపే మొగ్గు చూపారన్న టాక్‌‌‌‌‌‌‌‌ నడుస్తోంది. దీనికి తోడు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి క్రాస్‌‌‌‌‌‌‌‌ ఓటింగ్‌‌‌‌‌‌‌‌ సైతం పడిందన్న చర్చ జరుగుతోంది.

10 సార్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, మూడు సార్లు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ విజయం

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ స్థానం నుంచి అత్యధికంగా 10 సార్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లు విజయం సాధించారు. గత మూడు టర్మ్‌‌‌‌‌‌‌‌ల నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లు వరుస విజయాలు సాధించుకుంటూ వచ్చారు. అలాగే తెలంగాణ ప్రజా సమితి, జనతాదళ్, జనతా పార్టీ, బీజేపీ క్యాండిడేట్లు ఒక్కోసారి చొప్పున విజయం సాధించారు.