ఉమ్మడి ఖమ్మం జిల్లాను చలి వణికిస్తోంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటలు దాటే వరకు చలి పంజా విసురుతోంది. రాత్రి 8 గంటల తర్వాత పట్టణాల్లోని షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలలో ఒక్కసారిగా రద్దీ తగ్గుతోంది.
బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద ఆటో వాలాలు చలి కాచుకుంటున్నారు. స్వేటర్లు లేకుండా ప్రజలు బయటకు రావడం లేదు. దీంతో మంకి క్యాప్ లు,స్వేటర్లు, హ్యాండ్ గ్లోవ్స్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.