తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 20 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 20 గంటలు

తిరుమలలో భక్తీ రద్దీ పెరిగింది. స్వామి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది.  క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి.. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తుల సర్వ దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది. శనివారం  ( డిసెంబర్ 28) అర్దరాత్రి వరకు భక్తులు స్వామి దర్శనానికి వేచి యున్నారు.  క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి టీటీడీ ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. 

గత వారం రోజుల నుంచి  ప్రతి రోజు 29 కంపార్టుమెటులో నిండిపోతున్నాయి. రోజు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారని టీటీడీ ప్రకటించింది. ఈ నెలలో ఎక్కువగా సెలవులు రావడంతో ప్రతి రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దాదాపు 70 వేల మంది భక్తులు వస్తున్నారట. నిత్యం 25 వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకోగా... భక్తుల కానుకలతో నిత్యం 4 కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తుందని అధికారులు అన్నారు.  సంక్రాంతికి సెలవుల సమయంలో శ్రీవారి అధ్యయన ఉత్సవాలు జరగనుండటంతో భక్తుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా... అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రతి ఏడాది చివరలో... 450కి పైగా ఉత్సవాలు తిరుమలలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించే అధ్యయనోత్సావాలు చాలా పెద్ద ఎత్తున చేస్తారు. స్వామివారి సన్నిధిలో... దివ్య ప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ ఉత్సవాలు... ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు మొదలవుతాయి. ఈ డిసెంబర్ 30 నుంచి 2025 జనవరి 23 వరకు నిర్వహించే ఈ అధ్యయనోత్సవాలు మొత్తం 25 రోజులపాటు జరుగుతాయి.