యాదగిరిగుట్టలో మస్తు జనం..రద్దీతో సాయంత్రం బ్రేక్ దర్శనాలు రద్దు

  • ధర్మదర్శనానికి ఐదు,స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం
  •    రూ.85.33 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఆదివారం భక్తులు తరలివచ్చారు. సమ్మర్ హాలీడేస్​కు తోడు ఆదివారం కావడంతో తండోపతండాలుగా వచ్చారు. వాహనాలతో పార్కింగ్​ఏరియా నిండిపోవడంతో యాగశాల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ ప్లేస్ లోకి డైవర్ట్ చేశారు. డైవర్షన్ కారణంగా కొండ కింద ఘాట్ రోడ్డు వద్ద ట్రాఫిక్ జామయ్యింది. ప్రెసిడెన్షియల్ సూట్ సర్కిల్ వద్ద నుంచి ఘాట్ రోడ్డు ఎంట్రీ వరకు వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి 5 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటలు పట్టింది. భక్తులు పోటెత్తడంతో సాయంత్రం బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఉదయం రద్దీ సాధారణంగా ఉండడంతో 9 గంటల నుంచి 10 గంటల వరకు బ్రేక్ దర్శనాలను యథాతథంగా కొనసాగించారు. పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.85,33,262 ఆదాయం వచ్చింది.  ప్రసాద విక్రయం ద్వారా రూ.26,88,850, వీఐపీ టికెట్ల ద్వారా రూ.16.95 లక్షలు

ఉదయం బ్రేక్ దర్శన టికెట్లతో రూ.6,41,400, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.10 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.12,32,800, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.2,68,800, యాదరుషి నిలయం ద్వారా రూ.3,70,820, సువర్ణపుష్పార్చన పూజల ద్వారా రూ.1,40,296, తలనీలాల ద్వారా రూ.2,01 లక్షల ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.