టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 : ది రూల్ చిత్ర ట్రైలర్ ఆదివారం రిలీజ్ అయ్యింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అల్లుఅ అర్జున్, రష్మిక మందాన, ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ తదితరులు హాజరయ్యారు.
అయితే పుష్ప 2 : ది రూల్ చిత్ర ట్రైలర్ ఈవెంట్ కి దాదాపుగా 25వేల మందికి పైగా ఫ్యాన్స్, ప్రజలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అల్లు అర్జున్, రష్మిక ని చూడటానికి పోల్స్ పైకి ఎక్కారు. దీంతో అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
బీహార్ రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో రిలీజ్ ఈవెంట్లు జరగకపోవడంతో సినీ స్టార్స్ ని చూడటానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. అయితే పుష్ప సినిమాలోని కొన్ని షాట్స్ ని రీ క్రియేట్ చేస్తూ పోల్స్ పైకి ఎక్కారు. దీంతో నార్త్ లో పుష్ప మానియా మామూలుగా లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
#WATCH | Bihar: People climb on structures erected at Gandhi Maidan in Patna to catch a glimpse of Allu Arjun and Rashmika Mandanna at the trailer launch event of 'Pushpa 2: The Rule'. A massive crowd has gathered here, security deployed at the spot. pic.twitter.com/4KTaJ8EoxB
— ANI (@ANI) November 17, 2024
ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2: ది రూల్ ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే తెలుగులో 40 మిలియన్లు, హిందీలో 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో కలెక్షన్ల విషయంలో కూడా నార్త్ ఫ్యాన్స్ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
No, this is not a scene from any political rally, these scenes are from the trailer launch of Pushpa 2 at Gandhi Maidan, Patna. 😭 #Pushpa2 #AlluArjun pic.twitter.com/WlTGcLlb5z
— Prayag (@theprayagtiwari) November 17, 2024