
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ మార్చి 23 ఆదివారం కావడంతో ఇంకా భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట ఏటీజీహెచ్ వరకూ క్యూ లైన్ లో ఉన్నారు భక్తులు.
ఇక ఉచిత సర్వదర్శనం కోసం భక్తులకు సుమారు 20 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. రూ. 300 ప్రత్యేక దర్శనానికి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
మరోవైపు మార్చి 22న శనివారం తిరుమల శ్రీవారిని 75 వేల 428 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31వేల920 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.40 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.