తిరుమలకు పోటెత్తిన భక్తులు..దర్శనానికి 30 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణమాసం, వీకెండ్ కావడంతో...భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన....షెడ్లు కూడా భక్తులతో రద్దీగా మారాయి. ఇక ATGH వరకు బయట క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.

స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి లైన్ లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి ఉచిత దర్శనానికి దాదాపు 30 గంటలు సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది..