యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు నిలబడి ఉన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
ఉచిత దర్శనానికి 3గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, కల్యాణ కట్ట వద్ద కూడా భక్తుల కోలాహలం నెలకొంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చలవ పందిర్ల కింద భక్తులు సేదతీరుతున్నారు.
భక్తుల రద్దీని ముందే ఊహించిన ఆలయ సిబ్బంది భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది.