ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. వరుస సెలవులు రావడంతో ఫ్యామిలీతోసహా వచ్చి బడా గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు దర్శనానికి లాస్ట్ డే అవ్వడం తో దర్శనానికి క్యూ కడుతున్నారు భక్తులు.. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ , టెలిఫోన్ భవన్ నుండి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు.ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా సిసి కెమెరాల ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు.
సెప్టెంబర్ 15న ఉదయం 9.30 గంటలకు శ్రీనివాస కళ్యాణం జరగనుంది. సాయంత్రం బడా గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను పంచి పెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మహాశోభాయాత్ర తర్వాత..హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాడు గణనాథుడు.