గతకొద్ది రోజులుగా కార్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో దివాళి పండుగకు అన్ని అటో మొబైల్ కంపెనీలు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. సుజుకీ, హోండా, MG, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కంపెనీలో దీపావళి పండుగ సీజన్ కు కార్లు కొనాలనుకునే వారికి లక్షల్లో డిస్కౌంట్లు పెట్టాయి. దీపావళి తర్వాత కూడా ఎక్కువ డిస్కౌంట్లు పెట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆడీ, మెర్సిడెస్ బెంజ్, BMW లగ్జరీ కార్లు కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లకు తెర లేపాయి. వివిధ కార్లు దివాళి డిస్కౌంట్ లో భాగంగా వాటి ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి.
- పవర్ ఫుల్ ఆడీ Q8 e tron రూ.10 లక్షలు
- కియా EV6 రూ.12 లక్షలకు మాత్రమే లభిస్తోంది.
- మినీ పవర్‌హౌస్ గా పిలువబడే సుజుకి జిమ్నీ కారు మీద రూ.2.3 డిస్కౌంట్ ఉంది.
- టొయోటా ఇన్నోవా హైక్రాస్, మహీంద్రా 3 -డోర్ థార్ వంటి బ్లాక్‌బస్టర్‌లలో కొన్ని కూడా డిస్కౌంట్‌లోకి వచ్చాయి.
- థార్ 3-డోర్, 5-డోర్ సిబ్లింగ్ కొత్త వేరియంట్ ధర రూ.1.5 లక్షలు తగ్గింది.
- మహీంద్రా యొక్క XUV4OO ఎలక్ట్రిక్ వెహికల్ కూడా రూ.3 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది.
- మారుతి బాలెనో కారుపై రూ.1.1 లక్షలు, మారుతి గ్రాండ్ విటారాపై రూ.1.4 లక్షలు, వోల్డ్ వేరియంట్ స్కార్పియోపై రూ.1.2 లక్షలు, టయోటా ఫార్చ్యూనర్ మీద రూ.2 లక్షలు, జీప్ కంపాస్ కారుపై రూ. 2.5 లక్షలు ఇలా.. దాదాపు అన్నీ కార్లపై భారీ డిస్కౌంట్ ధరలు ఉన్నాయి.
- ఈ ఆపర్లో MG గ్లోస్టర్ రూ.4.9 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ఆడి A4 రూ.8 లక్షలకే వస్తోంది. మెర్క్ S క్లాస్ రూ.9 లక్షలకే ఈ డిస్కౌంట్ సేల్ లో లభిస్తోంది.