సుజనా, జీవీకే మాల్స్ హోర్డింగ్స్ కు భారీగా జరిమానాలు

సుజనా, జీవీకే మాల్స్ హోర్డింగ్స్ కు భారీగా జరిమానాలు

హైదరాబాద్ సిటీలో  పర్మిషన్లు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులపై GHMC స్పెషల్ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులకు భారీ జరిమానాలు విధిస్తోంది. లేటెస్టుగా కూకట్‌పల్లిలోని ఫోరమ్ సుజనా మాల్‌కు GHMC ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు 4 లక్షల జరిమానా విధించారు. దీంతో సుజనా మాల్స్ కు మొత్తంగా ఇప్పటి వరకు 16 లక్షల 50వేల జరిమానా విధించారు. అలాగే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ కు రూ. 2 లక్షలు, బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు రెండు లక్షల జరిమానా విధించింది GHMC .