ఆరోరా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి

కుత్బుల్లాపూర్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరోరా ఫార్మా కంపెనీ‎లో 2024, నవంబర్ 20న అగ్ని ప్రమాదం జరిగింది. బాయిలర్ శుభ్రం చేస్తోన్న క్రమంలో సాల్వెంట్ పేలడంతో అనిల్ (43) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ యాజమాన్యం యశోద ఆసుపత్రికి తరలించింది. స్థానికులు, కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు ఆరా తీస్తున్నారు. 

అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వట్లేరని కంపెనీ నిర్వహకులపై పోలీసుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ మృతికి కారణమైన ఆరోరా ఫార్మా కంపెనీ ముందు మృతుడి బంధువుల ఆందోళనకు దిగారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీ నడుపుతున్న ఆరోరా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని.. లేదంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మృతుడి బంధువులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆరోరా ఫార్మా కంపెనీ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.