- అయ్యప్ప షాపింగ్ మాల్లో అర్ధరాత్రి చెలరేగిన మంటలు
- 16 గంటల తర్వాత అదుపులోకి...
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప షాషింగ్మాల్లో బుధవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరగ్గా రూ. కోట్లలో ఆస్తినష్టం జరిగింది. తిలక్‌రోడ్‌లో ఉన్న ఈ షోరూంలో గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మొత్తం నాలుగంతస్తుల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వేళ గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు మొదలై అన్ని ఫ్లోర్లకూ వ్యాపించాయి. గమనించిన వాచ్మెన్ఓనర్లకు సమాచారమిచ్చాడు. రోడ్డుపై వెళ్తున్న వారు చూసి పోలీసులు, ఫైర్ఆఫీసర్లకు చెప్పడంతో వారు వచ్చేసరికే అన్ని ఫ్లోర్లలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
ఫైరింజన్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. దీంతో జిల్లా తో పాటు, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఐదు ఫైరింజన్లు తెప్పించారు. హైదరాబాద్ నుంచి డయాస్టర్ సీలింగ్‌తో కూడిన ఫైరింజన్, రెస్య్కూ టీమ్ కూడా వచ్చింది. స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంకర్లను కూడా ఉపయోగించారు. మాల్‌ను ఆనుకొని మరికొన్ని షాపులు, ఓ ప్రైవేట్ హాస్పిటల్ఉంది. హాస్పిటల్లో ఇద్దరు పెషెంట్లు, సిబ్బందితో పాటు, చుట్టు పక్కల ఉన్న బిల్డింగుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సమన్వయంతో పనిచేసిన పోలీసులు, ఫైర్ సిబ్బంది, మున్సిపల్ యంత్రాంగం గురువారం సాయంత్రం 4 గంటల వరకు మంటల్ని అదుపులోకి తేగలిగారు. రూ. 5 కోట్ల విలువైన బట్టలు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయని, రూ.10 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని ఓనర్లు చెప్పారు. ప్రమాద తీవ్రతకు బిల్డింగ్ కూడా దెబ్బతింది. రూ.7 కోట్ల వరకు నష్టం జరిగి ఉండొచ్చని ప్రాథమిక ఎంక్వైరీలో తేలిందని అధికారులు చెప్పారు. పూర్తి విచారణ తర్వాత ఎంత నష్టం జరిగిందన్నది తెలుస్తుందన్నారు.