కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద

కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద

కడెం, వెలుగు : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు

(7.603 టీఎంసీలు) కాగా ప్రస్తుత నీటిమట్టం 680.100 అడుగులు,(3.500టీఎంసీలతో) కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 3819 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు పేర్కొన్నారు.