హనుమకొండ-ములుగు జాతీయ రహదారిపై ఉధృతంగా వరద

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.  హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం కటాక్షాపూర్ చెరువు మత్తడి పోస్తుంది. హనుమకొండ-ములుగు జాతీయ రహదారిపై ఉధృతంగా వరద ప్రవాహిస్తోంది. దీంతో వాగు దాటాలంటే వాహనదారులు భయపడుతున్నారు.

మరోవైపు భారీ వర్షాలు వరంగల్ నగరవాసులను వణికిస్తున్నాయి. కుండపోతవానలు వరంగల్, హన్మకొండలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. వరంగల్ లోని పలు కాలనీ చెరువులను తలపిస్తున్నాయి. మోకాలు లోతుకుపైగా వరదనీటితో నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ, నాగేంద్రనగర్, SRనగర్, గణేష్ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. 

ALSO READ :ఆఫీసర్లు సెలవులు తీసుకోవద్దు : మంత్రి ప్రశాంత్​రెడ్డి

అటు వరద ముంచెత్తిన కాలనీలను వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. జలమయమైన కాలనీలల్లో  ట్రాక్టర్ పై ప్రయాణి లోతట్టుప్రాంతాలను పరిశీలించారు. బాధితులను స్వయంగా మాట్లాడిన సీపీ రంగనాథ్ ధైర్యం చెప్పారు. అటు కుంటలను తలపిస్తున్న రోడ్లతో బాధితులు ఇళ్లకు తాళాలేసి బంధువుల నివాసాల్లో తల దాచుకుంటున్నారు.   

మరోవైపు ఇవాళ ఉమ్మడి వరంగల్ లో భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని ప్రకటించిన వాతావరణశాఖ.. రెడ్  అలర్ట్  జారీ చేసింది. ఇప్పటికే బారీవర్షంతో కష్టాలు పడుతున్న నగరవాసులకు వాతావరణశాఖ హెచ్చరికలతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. హెవీ రెయిన్స్ తో లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.