వరంగల్ -హైదరాబాద్ హైవేపై భారీగా వరద. .5 కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్

వరంగల్ -హైదరాబాద్ హైవేపై భారీగా వరద. .5 కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్

రాత్రి నుంచి జనగామ జిల్లాలో తెంపు లేకుండా వర్షం పడుతోంది. దీంతో చెరువులు నిండుకుండల్లా మారియి. రహదారులు తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షానికి రఘునాథ్ పల్లి దగ్గర వరంగల్ –హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. DCP రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

మరోవైపు జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే రూట్లోని గానుపహాడ్ దగ్గర నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. తాల్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే రహదారి కుందారం దగ్గర మట్టిరోడ్డు కొట్టుకుపోయింది. చీటకొడూరు రిజర్వాయర్ కు వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది. భారీ వర్షాలతో జనగామ కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. అధికారులెవరూ సెలవుల్లో ఉండొద్దని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలర్ట్ ఉండాలన్నారు.