జూరాలకు భారీ వరద... 45 గేట్లు ఎత్తి నీటి విడుదల

జూరాలకు భారీ వరద... 45 గేట్లు ఎత్తి నీటి విడుదల

గద్వాల, వెలుగు: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌‌‌‌ డ్యామ్‌‌‌‌లతో పాటు మహారాష్ట్రలోని భీమా నది నుంచి జూరాలకు భారీ మొత్తంలో వరద వస్తోంది. భీమా నుంచి 1.45 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్‌‌‌‌ నుంచి 1.78 లక్షల క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. 

జూరాలకు 3.21 లక్షల ఇన్‌‌‌‌ఫ్లో వస్తుండడంతో 4.593 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని 45 గేట్ల ద్వారా 3,09,915 క్యూసెక్కులు, విద్యుత్‌‌‌‌ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19,288 క్యూసెక్కులు, కాల్వలతో కలిపి మొత్తం 3,31,047 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.