కామారెడ్డి, నిజాంసాగర్, వెలుగు : నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులకు గాను బుధవారం రాత్రి వరకు 1,402 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 12,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జిల్లాలో బుధవారం అక్కడక్కడా వర్షం కురిసింది.
జుక్కల్‌లో 46 మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగిరెడ్డిపేటలో 30 మి.మీ., మద్నూర్‌లో 22.2 మి.మీ., పెద్దకొడప్గల్లో 24.4 మి.మీ., నస్రుల్లాబాద్‌లో 25.3 మి.మీ., లింగంపేటలో 20 మి.మీ. వర్షపాతం నమోదైంది.