
పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 407అడుగుల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నీటిమట్టం మంగళవారం 405.60 అడుగులకు చేరింది. దీంతో రిజర్వాయర్‌కు ఉన్న 12 క్లస్ట్గేట్లలో 4 గేట్లను 3అడుగుల మేరకు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని కిన్నెరసాని దిగువప్రాంతానికి విడుదల చేశారు.