మానుకోటలో రాళ్ల వాన .. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు

మానుకోటలో రాళ్ల వాన .. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు
  • ఈదురుగాలులకు విరిగిన చెట్లు, కూలిన స్తంభాలు 

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌ జిల్లాలో సోమవారం రాత్రి రాళ్ల వాన పడింది. కేసముద్రం, కొత్తగూడ, గూడూరు, నెల్లికుదురు, తొర్రూరు, నరసింహులపేట మండలాల పరిధిలో భారీ సైజులో వడగండ్ల పడడంతో వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 

ఈదురుగాలుల కారణంగా భారీ వృక్షాలు, విద్యుత్‌‌ స్తంభాలు నేలకూలాయి. దీంతో వరంగల్‌‌– ఖమ్మం హైవే రాకపోకలు నిలిచిపోగా.. పలుచోట్ల విద్యుత్‌‌ సరఫరా నిలిచిపోయింది. కొత్తగూడ మండలంలో విద్యుత్‌‌ షాక్‌‌ కొట్టి షాక్​కొట్టి రెండు మేకలు చనిపోయాయి. అకాల వర్షం కారణంగా ఆరుబయట ఆరబోసిన వరి, మొక్కజొన్న తడిసిపోయాయి.