పులిచింతలకు మళ్లీ భారీగా ఇన్ ఫ్లో

మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు మళ్లీ ఇన్ ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 2,71,898 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా,13 గేట్లను ఎత్తి 3,12,040 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు 45.77 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి 38.83 టీఎంసీల స్టోరేజీ ఉంది. నాలుగు యూనిట్ల ద్వారా జెన్ కో లో పవర్ జనరేషన్ కొనసాగుతోంది.