వరుస సెలవులు రావడంతో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి రావడంతో ఆదివారం ఆలయం కిక్కిరిసింది. ప్రాకార మండపంలో నిర్వహించిన నిత్య కల్యాణంలో144 జంటలు కంకణాలు ధరించి పాల్గొన్నాయి.
భక్తులకు ప్రసాదాల కొరత లేకుండా ఈఓ రమాదేవి ఏర్పాట్లు చేశారు. ఉదయం ముందుగా సీతారాములకు సుప్రభాత సేవ చేసి, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. స్థానిక అంబసత్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అర్చకులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయగా, ఈఓ రమాదేవి ప్రారంభించారు. - వెలుగు, భద్రాచలం