వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు రెండు వ్యాన్లో పోలీసు బలగాలు చేరుకున్నాయి. వికారాబాద్ డిటిసి సెంటర్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి పరిగి పోలీసు స్టేషన్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిగి పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసరాల్లో పోలీసులు సామాన్య ప్రజల్ని అనుమతించడం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తల కారణంగా పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Also Read :- సురేశ్ కాల్ డేటాలో విస్తుపోయే నిజాలు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. బుధవారం ఉదయాన్నే పోలీసులు ఆయన్ని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్, కడా స్పెషల్ ఆఫీసర్లపై దాడి చేసిన ఘనటలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. బుధవారం ఉదయం 6గంటలకు కేబీఆర్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.