ఏపీలో మళ్ళీ వర్షాలు కురవనున్నాయి.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడురోజుల పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు పయనిస్తోందని.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తమిళనాడుతో పాటు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో విశాఖపట్నం, శ్రీకాకుళం,తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయనగరం, జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.
ఈ క్రమంలో దక్షిణ కోస్తా వ్యాప్తంగా.. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ. రాయలసీమలోని పలు జిల్లాల్లో ఓ మోసతారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని.. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ.
ALSO READ : AP Rains: రెయిన్ అలర్ట్.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు
భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది వాతావరణ శాఖ. తీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది వాతావరణ శాఖ.