కలియుగ వైకుంఠం తిరుమలలో భారీ వర్షం కురిసింది. శనివారం ( సెప్టెంబర్ 24, 2024 ) కుండపోతగా కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యారు భక్తులు. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవటంతో తిరుమల గిరులు కనువిందు చేశాయి.జడివానలో తిరుమల గిరుల అందాలు కనువిందు చేశాయి. వర్షంలో శ్రీవారి ఆలయ పరిసర అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు శ్రీవారి భక్తులు.
Also Read :- హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు
ఓ పక్క వెంకన్న నామస్మరణ.. మరోపక్క మనసును ఆహ్లాదపరిచే జడివానలో శ్రీవార భక్తులు పరవశించిపోయారు. తిరుమల అందాలను వీడియోలు, ఫోటోల్లో బంధించారు భక్తులు.భక్తి భావం.. ప్రకృతి అందాలన్ని ఒకేచోట రాశి పోయినట్లుగా కనువిందు చేస్తున్న తిరుమల గిరులు కళ్లు తిప్పుకోనివ్వటంలేదంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు భక్తులు.