బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా ఎక్కడో ఒక చోట వాన పడుతోంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్ పేట్, మూసాపేట్, పంజాగుట్ట, అమీర్ పేట్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్టూడెంట్స్, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు.. అల్ప పీడన ప్రభావంతో మరో రానున్న మరో మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించండంతో స్టేట్ గవర్నమెంట్స్ అప్రమత్తమయ్యాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం రెస్య్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెయిన్ స్టేటస్ పై ఎప్పటికప్పుడు సమాచారం తెలుకోవాలని అధికారులకు సూచించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతేనే ఇళ్ల నుండి బయటకు వెళ్లాలని ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి చెప్పాలని సూచించారు.