నల్గొండ జిల్లా హాలియా మండలంలో భారీ వర్షం

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియా మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా సరైన వర్షాలు లేక   ఎండిపోతున్న  పత్తి, జొన్న, కంది, మినుము, పెసర, ఆముదం మిర్చి వంటి మెట్ట పంటలకు ఈ వర్షం  ఊరటనిచ్చింది.  సాగర్​ జలాశయానికి సరిపోను నీరు రాకవడంతో హాలియా డివిజన్​లో రైతులు బోర్ల ద్వారా  1,03,044 ఎకరాల్లో వరి, 1,00195 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు.

వీటితో పాటు బత్తాయి, నిమ్మ, జామ, దానిమ్మ, పామాయిల్​  తోటలను సాగు చేస్తున్నారు.  జూన్ నెల నుంచి ఇప్పటివరకు సరైన వర్షం పడలేదు.   సాగుచేసిన  పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా  పత్తి రైతులకు ఈ వర్షం ఎంతో  మేలుచేసిందని అంటున్నారు. అలాగే  బోరు బావుల ఆధారంగా సాగుచేసిన వరి పంటలు కూడా  నీటి తడులు సరిపోకపోవడంతో సాగులో ఉన్న వరి పంటలు ఎండిపోయే దశకు చేరాయి.