హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. ఉక్క పోతతో ఉక్కిరిబిక్కిర అవుతున్న నగర వాసులకు చల్లని చినుకులతో వరుణుడు పులకరింతలు తెచ్చాడు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ , నారాయణగూడ , బషీర్ బాగ్ , అబిడ్స్ , కోఠి , నాంపల్లి , బేగంబజార్, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్, పద్మారావు నగర్, రెజిమెంటల్ బజార్,కుమ్మరిగూడ, రాణిగంజ్, బేగంపేట, మారేడ్ పల్లి, అడ్డగుట్ట,తుకారాం గేట్, బోయిన్ పల్లి, కూకట్ పల్లి, KPHB, బంజారాహిల్స్, మీర్ పేట్, బడంగ్ పేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.
వర్షం కారణంగా పలు ఏరియాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని తెలిపారు.