బెంగుళూరులో భారీ వర్షం.. ఆర్సీబీ, పంజాబ్ మ్యాచ్ జరిగేనా..?

బెంగుళూరులో భారీ వర్షం.. ఆర్సీబీ, పంజాబ్ మ్యాచ్ జరిగేనా..?

కర్నాటక రాజధాని బెంగుళూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకే టాస్ పడాల్సి ఉండగా.. వర్షం వల్ల డిలే అయింది. భారీ వర్షం కురవడంతో స్టేడియాన్ని కవర్లతో కప్పి ఉంచారు. స్టేడియం పరిసరాల్లో చిరు జల్లులు కురుస్తుండటంతో మ్యాచ్ మరింత ఆలసమయ్యే అవకాశం ఉంది. దీంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. 

కాగా, ఐపీఎల్ 18లో శుక్రవారం (ఏప్రిల్ 18) మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. లీగులో ఆల్‎రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 

సొంత గడ్డలో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీ ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగుతుండగా.. లాస్ట్ మ్యాచులో 111 పరుగుల సల్ప లక్ష్యాన్ని కాపాడుకుని అద్భుత విజయం సాధించిన పంజాబ్ రెట్టించిన ఉత్సాహంతో ఆర్సీబీతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ సీజన్లో చెరో 6 మ్యాచులు ఆడిన ఆర్సీబీ, పంజాబ్.. నాలుగింట్లో విజయం సాధించి.. రెండు మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉండగా.. పంజాబ్ ఫోర్త్ ప్లేస్‎లో ఉంది.