గాలి వాన బీభత్సం.. తడిసిన ముద్దైన వడ్లు

కడెం, వెలుగు: ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా దస్తూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి.

ఈదురుగాలులతో దస్తూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూచన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెల్లి సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోగా, బూత్కూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో సదల మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇల్లు ధ్వంసమైంది. చాలా గ్రామాల్లో మామిడికాయలు నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మూన్యాల్ గ్రామంలో ప్రధాన రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి.  దస్తూరాబాద్ మండల కేంద్రంలో కరెంటు స్తంభం విరిగిపోవడంతో విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరఫరా నిలిచిపోయింది.