హైదరాబాద్​లో దంచికొట్టిన వాన

హైదరాబాద్​లో దంచికొట్టిన వాన
  •     మూడు గంటలపాటు కుండపోత

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్​లో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా  వాన దంచికొట్టింది. సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో మొదలైన వాన అర్ధరాత్రి వరకు నాన్​స్టాప్​గా కురిసింది. చందానగర్, మియాపూర్, బోడుప్పల్, ఉప్పల్, పీర్జాదిగూడ, మలక్​పేట, దిల్​సుఖ్​నగర్, చాదర్​ఘాట్, కూకట్​పల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, కీసర, అబిడ్స్, నాంపల్లి, కోఠి, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, మణికొండ, నార్సింగి, గండిపేట్, బండ్లగూడ జాగీర్, హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, పంజాగుట్ట, సికింద్రాబాద్​తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జోరు వాన పడింది. దీంతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఓల్డ్​సిటీతోపాటు పలు ప్రాంతాల్లో విద్యుత్​సరఫరాకు అంతరాయం కలిగింది. రాత్రి అందరూ పడుకునే టైంలో వాన పడడంతో పెద్దగా ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తలేదు.