భాగ్యనరంలో దంచికొట్టిన వాన

భాగ్యనరంలో దంచికొట్టిన వాన

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది.  ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండగా, సాయంత్రం భారీ వర్షం పడింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కురిసిన వర్షానికి రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. 

వరద  చేరిన ప్రాంతాల్లో హైడ్రా డీఆర్​ఎఫ్ టీమ్స్, బల్దియా స్టాటిక్ టీమ్స్ వర్షపు నీటిని తొలగించే పనులు చేపట్టాయి. ఆర్సీపురం  5.65, షేక్ పేట్ 3.50, గచ్చిబౌలి 3.50 , చందానగర్  3.33, గోల్కొండ 2.78,  మియాపూర్ 2.75 సెంటిమీటర్ల వర్షం కురిసింది.