- మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్వరకు నిలిచిన వెహికల్స్
- ఓపిక నశించి పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్‌వే ఎక్కిన బైకర్లు
- ముందు కదల్లేక అర్ధరాత్రి వరకు ట్రాఫిక్‌లోనే..
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన వర్షం నరకం చూపించింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు గంటల తరబడి చుక్కలు చూడాల్సి వచ్చింది. అంబర్‌పేట, రామంతాపూర్, లక్డీకాపూల్, నాంపల్లి, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, కార్వాన్, గోషామహల్, సంతోశ్‌నగర్, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, ఘట్కేసర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, అత్తాపూర్, లంగర్హౌస్తదితర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.
అత్యధికంగా మెహిదీపట్నంలో 5.5 సెం.మీ, చాంద్రాయణగుట్టలో 4.8, ఆసిఫ్ నగర్లో 4.6, కందికల్ గేట్‌వద్ద 3.9, లంగర్ హౌస్‌లో 3.5, బార్కస్‌లో 3.0 సెం.మీ వర్ష పాతం నమోదైంది. ఫ్లైఓవర్కింద మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్వరకు ట్రాఫిక్స్తంభించిడంతో టూవీలర్వాహనదారులు పీవీఎన్ఆర్ఎక్స్ ప్రెస్‌వే ఎక్కారు. ఫ్లైఓవర్ పైనా ట్రాఫిక్నిలిచింది. శంషాబాద్ఎయిర్పోర్టుకు వెళ్లేవారు నరకం చూశారు. అర్ధరాత్రి వరకు పీవీఎన్ఆర్ఎక్స్ ప్రెస్వేపై వాహనాల రద్దీ కొనసాగింది. పిల్లర్‌నంబర్ 104 వద్ద భారీగా వరద చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఇటు మెహిదీపట్నం వరకు అటు అత్తాపూర్ వరకు, కార్వాన్ నుంచి లంగర్ హౌస్ వరకు ట్రాఫిక్ నిలిచింది. లక్డీకాపూల్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, మెహిదీపట్నం, అఫ్జల్‌గంజ్, అత్తాపూర్తదితర ప్రాంతాల్లో భారీగా జామ్ఏర్పడింది.