హైదరాబాద్ సిటీలో దంచికొట్టిన వాన

హైదరాబాద్ సిటీలో దంచికొట్టిన వాన

సిటీలో బుధవారం సాయంత్రం వాన దంచికొట్టింది. రెండుగంటలకు పైగా కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో  వాహనాల రాకపోక లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు అయ్యాయి.  లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. అత్యధికంగా నాంపల్లిలో 8.55, బండ్లగూడలో 8.18, చార్మినార్ లో 8.03 , కూకట్ పల్లిలో 7.63, ఖైరతాబాద్ లో 7.45 సెం.మీ చొప్పున నమోదైంది. చెట్లు విరిగిపడ్డాయని, రోడ్లపై వరదనీరు చేరిందని జీహెచ్ఎంసీకి 30 ఫిర్యాదులు వచ్చాయి. డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టి.. విరిగిన చెట్లను తొలగించింది.  

- వెలుగు , హైదరాబాద్