హైదరాబాద్ సిటీలో క్యుములో నింబస్ మేఘాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం

హైదరాబాద్ సిటీలో క్యుములో నింబస్ మేఘాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం

హైదరాబాద్ సిటీపై క్యుములో నింబస్ మేఘాలు ఆవరించాయి. 2025, ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎండగా ఉన్న వాతావరణం.. ఒక్కసారిగా మారిపోయింది. చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. హైదరాబాద్ సిటీపై క్యుములో నింబస్ మేఘాలు ఆవరించాయి. దట్టమైన మేఘాలతో పగలే చీకట్లు అన్నట్లు మారిపోయింది వెదర్. హైదరాబాద్ సిటీలోని ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట ఎరియాల్లో గాలి దుమారంతో వడగండ్లు పడ్డాయి. దీంతో రాజ్ భవన్ ఏరియాలో పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలిపోవటంతో ట్రాఫిక్ జాం అయ్యింది. 

ఇక బషీర్ బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అబిడ్స్, కోఠి, సైఫాబాద్, మలక్ పేట, సైదాబాద్, చాదర్ ఘాట్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది.

ALSO READ | హైదరాబాద్ కోకాపేటలో సుడిగాలి బీభత్సం

సికింద్రాబాద్ ఏరియాలోనూ వర్షం బీభత్సం చేసింది. బేగంపేట.. రాణిగంజ్.. ప్యారడేజ్..ప్యాట్నీ..మారేడ్ పల్లి..సీతాఫల్ మండి.. మోండా మార్కెట్.. రెజిమెంటల్ బజార్..బోయిన్ పల్లి తోపాటు తదితర ప్రాంతాల్లో ఈదురు గాలితో వర్షం పడుతుంది. గాలి వానకు చెట్లు విరిగిపడుతున్నాయి..రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోటట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.