హైదరాబాద్లో దంచికొడుతున్న వాన..రెడ్ అలర్ట్ జారీ

హైదరాబాద్లో దంచికొడుతున్న వాన..రెడ్ అలర్ట్ జారీ

హైదరాబాద్ లో వాన దంచికొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.  ఉదయం నుంచి ఎండగా  ఉన్న వాతావరణం .. సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పుడు మబ్బులు కమ్ముకొని వాన కురుస్తోంది.

హైదరాబాద్ లో భారీ వర్షాలు ఉన్నాయి .. జాగ్రత్త అని నిన్న గురువారం వాతావరణ శాఖ ఎల్లో జారీ చేసినట్లుగానే నగరంలో వర్షం కురుస్తోంది. గంటన్నర నుంచి కురుస్తున్న వర్షానికి గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఐకియా నుంచి హైటెక్ సిటీ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Ikea జంక్షన్ వద్ద వర్షం తగ్గినప్పటికి ట్రాఫిక్ జాం కొనసాగుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందుల ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన రాయదుర్గం, మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

మరోవైపు లక్డీకాపూల్, ట్యాంక్ బండ్ పరిసరర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, పంచాగుట్ట, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్ లలో కూడా వర్షం పడింది.

సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అల్వాల్, మచ్చ బొల్లారం, జవహర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాల తోపాటు రోడ్లన్నీ జలమయం అయ్యాయి.బోయిన్ పల్లి,బేగంపేట్,మారేడ్ పల్లి,తుకారం గేట్, చిలకలగూడ,సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ప్యారడైస్, ప్యాట్ని సెంటర్ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.

భారీగా కురిసిన వర్షానికి బోయిన్ పల్లి సీతారాంపురం, సాయిబాబా కాలనీ...శ్రీనివాస నగర్ కాలనీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.వరద నీటికి వాహనదారులు పాదాచార్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు...

రానున్న గంటల్లో హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇవాళ(శుక్రవారం ఆగస్టు 16, 2024న) రెడ్ అలెర్ట్ జారీ చేసింది.