హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి,మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ,అమీర్ పేట్, యూసఫ్ గూడ, బోరబండ, పంజాగుట్ట,ఖైరతాబాద్ లో వర్షం పడుతోంది.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సికింద్రాబాద్ తోపాటు కంటోన్మెంట్, మారేడ్ పల్లి ,బోయిన్ పల్లి, బేగంపేట, రానిగంజ్, మోండా మార్కెట్, అడ్డగుట్ట, సీతాపల్ మండి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుంది, అబిడ్స్ , నారాయణగూడ , బషీర్ బాగ్ పరిసరాల్లోనూ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సికింద్రాబాద్ టూ హైటెక్ సిటీ, లింగంపల్లి నుంచి ఖైరతాబాద్ రూట్లలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ALSO READ | తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
మరో వైపు తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.