అలర్ట్: హైదరాబాద్లో వడగళ్ల వాన బీభత్సం.. ఈ రూట్లలో వెళ్లే వారు జాగ్రత్త

అలర్ట్: హైదరాబాద్లో వడగళ్ల వాన బీభత్సం.. ఈ రూట్లలో వెళ్లే వారు జాగ్రత్త

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం (మార్చి21) ఉదయం నుంచి గాలులు వీస్తూ వెదర్ కాస్త కూల్ అయ్యింది. సాయంత్రం అయ్యే సరికి వర్షం పడే అవకాశం ఉన్నట్లు మారిపోయింది. రెండు రోజులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

అన్నట్లుగానే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. తీవ్రమైన ఈదురు గాలులకు తోడు ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. బలమైన గాలులతో వడగళ్ల వాన కురుస్తుండటంతో నగరవాసులు ఇళ్లలోకి వెళ్లిపోయారు. 

మియాపూర్, చందానగర్,  మదినగూడ,  లింగంపల్లి, పటాన్ చెరు, అమీన్ పూర్ ప్రాంతాల్లో భారీ  వడగళ్ల వాన కురుస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షం కురుస్తుండటంతో అక్కడక్కడ కరెంటు సరఫరా ఇబ్బందులు ఉండవచ్చునని విద్యుత్ శాఖ తెలిపింది. 

శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడుతోంది.  

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.  అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా  తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని  సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.