జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుండపోత వాన పడుతోంది. ఆదివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం కారణంగా సుమారుగా 4 వేల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు సుమారు రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
Also Read :- 4 వారాల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి
మరోవైపు ఎడతెరిపి లేని వర్షంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కుండపోత వర్షంతో జిల్లాలోని చెరువులు, కాలువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు హెచ్చరించారు.