హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. శనివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన పడుతోంది. బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్ బీ నగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, లక్డీకపూల్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

ALSO READ : కేటీఆర్కు పొంగులేటి సవాల్..ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా?

ఆఫీస్‎లు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. నగరంలో భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లో తట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో వరద నీరు నిలిచే ఏరియాల్లో తొలగింపునకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నగరవాసులకు అధికారులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం కురుస్తుండటంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లొద్దని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.