హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇవాళ (అక్టోబర్ 3) ఉదయం నుండి నగరంలో ఎండ దంచికొట్టగా.. మధ్యాహ్ననికి సడెన్గా వెదర్ ఛేంజ్ అయ్యింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి సిటీలోని పలుచోట్ల వర్షం కురిసింది. సిటీలోని బాగ్ లింగం పల్లి, నారాయణ గూడ, రాంనగర్, విద్యా నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, అమీర్ పేట్, కూకట్ పల్లి, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. బషీర్ బాగ్, అబిడ్స్, హిమాయత్ నగర్, లక్డీ కపుల్, ఓల్డ్ సిటీ ఏరియాల్లోనూ వాన పడుతోంది. అప్పటి వరకు ఎండ.. అప్పటికప్పుడు జోరు పడటంతో నగరవాసులకు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. వాతావరణంలో ఈ అనూహ్య మార్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ALSO READ | కొడితే ఎండ లేదా వాన.. హైదరాబాద్లో వాతావరణ అనుహ్య మార్పులకు కారణం ఇదే..!