సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పట్టణంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్స్తంబాలు నేలకొరిగాయి.
మరోవైపు హాలియా పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ప్రధాన రహదారిపై రెండు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.